Sunday, May 5, 2024

ట్విట్టర్ నచ్చకపోతే.. మాస్టర్ బేటెడాన్ కి వెళ్లిపోండి.. ఎలాన్ మస్క్ ట్వీట్

ట్విట్టర్ నచ్చకపోతే ..మాస్టర్ బేటెడాన్ అనే ఒక అద్భుతమైన సైట్ ఉందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ కొత్త అప్ డేట్లపై యూజర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో, ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది. మరీ దురుసుగా ట్వీట్ పెట్టి, తర్వాత డిలీట్ చేశారు. . నచ్చని వారిని వెళ్లిపోవచ్చన్నట్టుగా ఆయన ట్వీట్ పెట్టడంపై విమర్శలు రావడంతో, దాన్ని డిలీట్ చేశారు. మాస్టడాన్ పేరుతో మరో సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్ ను మస్క్ ప్రస్తావించం దీన్ని మరోసారి యూజర్లకు గుర్తు చేసినట్టయింది. గంటల తరబడి ఈ ప్లాట్ ఫామ్ సర్వర్లు డౌన్ కావడంతో వ్యంగ్యంగా దీన్ని పేర్కొన్నట్టు కనిపిస్తోంది. మాస్టడాన్ అనేది కొత్తది కాదు. 2019లోనూ ఇది మనదేశంలో ప్రచారానికి నోచుకుంది. సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేయడంతో, అప్పుడు కొంత మంది నిరసనగా మాస్టడాన్ కు వెళ్లిపోయారు. ట్విట్టర్ మాదిరి ఫీచర్లను మాస్టడాన్ అందిస్తుంటుంది. సొంత కమ్యూనిటీని ఇందులో ప్రారంభించొచ్చు. లేదంటే అప్పటికే ఉన్న మరో కమ్యూనిటీలో చేరొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement