Wednesday, May 8, 2024

BuZ: దేశంలో తొలి క్రిప్టోక‌రెన్సీ సూచీ IC15

క్రిప్టోవైర్ సూప‌ర్ యాప్ భార‌త తొలి క్రిప్టోక‌రెన్సీ సూచీ IC15ను రూపొందించింది. ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీలలో అత్యంత విస్తృతంగా ట్రేడ్ అవుతున్న 15 క్రిప్టోకరెన్సీల పనితీరును ఇది కొలుస్తుంది. క్రిప్టోకరెన్సీపై అవగాహన, జ్ఞానాన్ని పెంచడానికి.. బ్లాక్ చెయిన్ వ్యవస్థ, వర్చువల్ కాయిన్ ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదారులకు ఇది సహాయం చేస్తుంది. 2022 జనవరి 1 నాటికి, Bitcoin, Ethereum, Binance Coin, Solana అనేవి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నట్టు ఇది వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement