Thursday, April 25, 2024

నా కోసం ఫ్రాంచైజీలు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తాయ‌ని ఊహించ‌లేదు.. శామ్ క‌ర‌న్

వేలం జ‌ర‌గ‌డానికి ముందు కొంత నెర్వ‌స్ గా అనిపించింద‌ని శామ్ క‌ర‌న్ తెలిపాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన శామ్ కరన్.. వేలం తర్వాత స్పందించాడు. రికార్డు ధర పలకడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ మినీ వేలం ఎలా జరుగుతుందోననే టెన్షన్ తో ముందురోజు సరిగా నిద్ర పోలేదని ఇగ్లాండ్ యువ ఆటగాడు శామ్ కరన్ మీడియాకు వెల్లడించాడు. అయితే తనకోసం ఫ్రాంచైజీలు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తాయని ఊహించలేదని కరన్ చెప్పాడు.

శుక్రవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో శామ్ కరన్ ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ధరను పెంచాయి. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఈ ఆల్ రౌండర్ కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో పాటు పంజాబ్ కింగ్స్ వేలంలో పోటీ పడ్డాయి. చివరకు రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు శామ్ కరన్ ను దక్కించుకుంది. కాగా, 2019లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కరన్.. ఆ సీజన్ లో పంజాబ్ జట్టుకే ఆడడం విశేషం. ఇప్పుడు మరోసారి అదే జట్టు తరఫున ఆడనుండడంపై కరన్ సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement