Saturday, May 18, 2024

Wonder: ‘నాకు మ‌జా రావ‌ట్లేదు, రిజైన్ చేస్తున్నా’.. సిల్లీగా అనిపించినా ఇది చాలా పెద్ద స‌మ‌స్యే!

జాబ్‌కి రాజీనామా చేయాలంటే ఎవరైనా రకరకాలుగా ఆలోచిస్తారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కానీ, అతి కష్టం మీదనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటారు. దానికి కారణాలను సవివరంగా రాసి రాజీనామా లేఖను బాస్‌ ముందు పెడతారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం సూటిగా తన సమస్యను రెండు ముక్కల్లో చెప్పేసి జాబ్‌కి రిజైన్ చేసేశాడు. అది కూడా ప్రముఖ కంపెనీ ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉన్న తన జాబ్​ని వదిలేసుకున్నాడు.

సదరు ఉద్యోగి రాసిని రిజిగ్నేషనల్ లెటర్‌ను ఫొటో తీసిన ఆ కంపెనీ చైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేశారు. ఇంతకీ ఆ లెటర్‌లో ఏముందో తెలుసా? ‘‘డియర్ సర్​, అయామ్​ రిజైన్​. మజా నహీ ఆ రహా ’’ అని మాత్రమే ఉంది.

దాన్ని షేర్ చేసిన గోయెంకా.. ‘‘ఈ లెటర్ చిన్నగా ఉన్నా కూడా చాలా లోతుగా ఆలోచింపచేస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. మనందరం కలిసి సాల్వ్ చెయ్యాలి’’ అని పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మరికొందరు నెటిజన్లు అవును.. ఇది నిజమేనంటూ కామెంట్లు పెట్టారు. నిజంగానే ఇది చాలా పెద్ద సమస్యేనని వాళ్లు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement