Friday, May 10, 2024

మార్చి నుండే ‘సూర్య‌’ప్ర‌తాపం

శీతాకాలం ముగియ‌నుంది. ఇక మార్చి 1నుండి వేస‌వికాలం ప్రారంభం కానుంది. కాగా గురువారం హైదరాబాద్ లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠం, 32.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 15-21 డిగ్రీల మధ్య కనిష్ఠం, 31-32 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి క్రమంగా పెరగనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దక్షిణం నుంచి గాలులు.. తెలంగాణ వైపు వీస్తుండడంతో పొడి వాతావరణం నెలకొంది. వచ్చే కొన్ని వారాల్లో ఇక వేసవి సీజన్ మొదలవుతుందని అంచనా వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఎండ తీవ్రత సీజన్ మొత్తం మీద 40 డిగ్రీల స్థాయిలో ఉండనుంది’’ అని వాతావరణ కేంద్రం ఇంచార్జ్ డైరెక్టర్ నాగరత్న వెల్ల‌డించారు. కాగా, గతేడాది వేసవి సీజన్ లో ఎండ తీవ్రత కొంత తక్కువగా ఉంది. ఈ ఏడాది కూడా అదే మాదిరి వాతావరణం ఉండొచ్చని వాతావరణ పరిశోధకుల అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement