Saturday, May 18, 2024

మనిషికి ఒళ్లంతా విషమే..!

ఎప్పుడైనా ఎవరైనా ఎదుటి వ్యక్తి చెడు కోరుకున్నారంటే…ఆ మనిషికి ఒళ్లంతా విషమే అంటూంటారు. అలా ఆ వ్యక్తిలో ఉన్న చెడుని విషంతో పోల్చుతారు పెద్దలు. కాని ఈ మాట ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి వచ్చిందని జపాన్ లోని ఒకినావా ఇన్‌స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. మంచివారు, చెడ్డవారు అనే తేడా లేకుండా మనుషులందరిలోనూ అచ్చం పాముల్లోలాగానే విషం తయారు చేసుకోగల యంత్రాంగం ఒకటుందని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మనుషుల్లోనే కాదు.. క్షీరదాలన్నింటిలోనూ విష వ్యవస్థ ఉందని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. నోట్లో ఉండే లాలాజల గ్రంధులకు, పాముల్లో ఉండే విషగ్రంధులకు మధ్య కొంత సంబంధం ఉందని వివరించారు. పాముల విష గ్రంధుల్లోనూ.. మనుషుల లాలాజల గ్రంధుల్లోనూ కామన్‌గా ఉండే జన్యువులను పరిశీలించారు. ఆ పాముల్లోని 3000 జన్యువులు.. కాలిక్రియెన్స్‌ అనే ప్రొటీన్లను ఉత్పత్తు చేస్తున్నట్టు గుర్తించారు. పాము ఒత్తిడికి గురైనప్పుడు ఈ కాలిక్రియెన్‌ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి. విషం తయారీకి కావాల్సిన ప్రాథమిక ప్రొటీన్‌ ఇది. మరీ ఈ పరిశోధనలో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేసిచూడాల్సిందే…

Advertisement

తాజా వార్తలు

Advertisement