Sunday, April 28, 2024

Akhanda: ‘అఖండ’ దెబ్బకు థియేటర్ లో బాక్సులు బద్దలు

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ థియేటర్లలో రచ్చ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘అఖండ’ మేనియా నడుస్తోంది. విదేశాల్లో సైతం బాలయ్య ఫీవర్ పట్టుకుంది. సినిమా ‘అఖండ’ విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్, ఫైట్స్​కు దద్దరిల్లిపోతున్నాయి. స్క్రీన్ మీద బాలయ్య కనిపించగానే అభిమానులు కేరింతలు కొడుతున్నారు.  ఈ సినిమాలోని బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​కు తమ థియేటర్లలోని స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉందని యూఎస్ లోని ఓ థియేటర్ల యాజమాన్యం భయపడింది. అందుకే ఉంచాల్సిన దాని కంటే కొంచెం సౌండ్​ తగ్గించి ప్లే చేస్తున్నామని థియేటర్​లో ఓ నోట్​ అతికించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్​గా మారింది.

కాగా, నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్ చేసిన ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement