Thursday, April 25, 2024

మూడు నెలలుగా అందని వైద్య… మావల్లకాదంటున్న డాక్ట‌ర్ లు..

కర్నూలు, (ప్రభన్యూస్‌): జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమ్మ వైద్యానికి దూరంగా ఉంటున్నాయి. తమ వల్ల కాదంటూ పెద్దాసుపత్రికి వెళ్లాలని సిఫారసు చేయడంతోనే సరిపెడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో 86 పిహెచ్‌సిలు ఉండగా వాటిలో 51 కేంద్రాలు 24 గంటలు పనిచేయాలి. ప్రస్తుతం 165 మంది వైద్యులు ఉన్నారు. ఎంపిహెచ్‌ఓలు 117, స్టాఫ్‌ నర్సులు 212, ఫార్మాసిస్టులు 80 మంది, 300 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కేంద్రాల్లో ఇద్దరు వైద్యులతో పాటు ఇద్దరు స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉండాలి. జిల్లాలో 24 గంటలు పిహెచ్‌సిలలో 15 ప్రసవాలు చేయాలి.

కొలిమిగుండ్ల, క్రిష్ణగిరి, పగిడిరాయి, కొట్టాల చెరువు, ఆర్‌ఎస్‌ రంగాపురం, హాలహర్వి, ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు మాసాల్లో ఒక్క ప్రసవం కూడా జరగలేదు. 10 పిహెచ్‌సిలలో 50 లోపు ప్రసవాలు చేశారు. 12 గంటల పిహెచ్‌సిలలో నెలకు 10 చొప్పున ప్రసవాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఈ పిహెచ్‌సిలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. నెలకు 10 చొప్పున ప్రసవాలు చేయాలని ఆదేశాలు ఉన్నా జిల్లాలో అమలుచేయకపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement