Monday, April 29, 2024

Romance: లేటు వయసులో ఘాటు లవ్వు: మాజీ విశ్వ సుందరితో మోదీ రొమాన్స్​..

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్​తో ఐపీఎల్​ మాజీ చైర్మన్​ లలిత్​ మోదీ రొమాన్స్​ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. సుస్మితా అభిమానులు అయితే షాక్​కు గురయ్యారనే చెప్పవచ్చు. ఏంటీ నీకెవ్వరు దొరకలేదా? ఈ ముసలోడితో ఎఫైర్ ఎందుకు​? అంటూ చాలామంది కామెంట్స్​ కూడా చేస్తున్నారు. ఇక.. మోదీ, సుస్మిత గాలిచొరబడనంత దగ్గరగా ఉన్న ఫొటోలపై కామెంట్స్​, ట్రోల్స్​తో సోషల్​ మీడియా హీటెక్కిపోతోంది.

తాను బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ప్రకటించారు. ఈమేరకు మోదీ ట్విట్టర్‌లో వారిద్దరు కలిసి ఉన్నఫొటోలను షేర్​ చేశారు. సుస్మితను తన ‘బెటర్ హాఫ్’ అని తెలిపారు. ఇది తమ ‘న్యూ బిగినింగ్​’ అని అభివర్ణించారు లలిత్​ మోదీ.

“కుటుంబంతో కలిసి తిరుగుతున్న గ్లోబల్ టూర్ #మాల్దీవులు #సార్డినియా తర్వాత లండన్‌కు తిరిగి వచ్చాను. – నా #బెటర్‌హాఫ్ @sushmitasen47 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. – చివరకు తనతో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఓవర్​ ద మూన్​” అని మోదీ ట్విట్టర్​లో పేర్కొన్నారు. 

అయితే.. ఈ ట్వీట్ వైరల్ అయిన కొద్ది సేపటికే అతను మరొక ట్వీట్‌లో “క్లారిటీ కోసం చెబుతున్నా.. ఇంకా మా పెళ్లి కాలేదు. కేవలం ఒకరితో ఒకరం డేటింగ్​లో మాత్రమే ఉన్నాం. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది” అని తెలిపారు లలిత్​ మోదీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement