Thursday, April 25, 2024

‘Hindu’ Persian word: హిందూ పదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్​మీడియాలో వైరల్​

“హిందూ” అనే పదం భారతదేశానికి సంబంధించినది కాదని, దాని మూలాన్ని అన్వేషిస్తే ఆ పదానికి ఎంతో వల్గర్​ అర్థం వస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్నాటకకు చెందిన కాంగ్రెస్​ నేత సతీష్​ జార్కిహోలి. ఈ పదాన్ని మనపై బలవంతంగా రుద్దుతున్నారని చెప్పారు. హిందూ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందనే అంశంపై పరిశోధన చేస్తే.. అది పర్షియా నుంచి వచ్చినట్టుగా తెలుస్తోందన్నారు. ఇంకా ఎక్కడ వాడుకలో ఉందన్న వివరాలను ఆరాతీయగా.. ఇరాన్, ఇరాక్, కజకిస్థాన్​, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో వాడుకలో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కాబట్టి, భారతదేశంతో హిందూ పదానికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు.

ఈ అంశంపై చర్చ జరగాలని జార్కిహోళి పిలుపునిచ్చారు. WhatsApp, వికీపీడియాను తనిఖీ చేయండి. ఈ పదం మనది కాదు. దీన్ని నెత్తిపై ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? మీరు దాని అర్థం గురించి తెలుసుకున్నప్పుడు సిగ్గుపడతారు. పదం యొక్క అర్థం చాలా వల్గర్​గా ఉంది. ఇది నేను చెప్పడం లేదు. ఇది ఇప్పటికే వెబ్‌సైట్‌లలో ఉంది అని జార్కిహోళి అన్నారు.

కర్నాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లాలో ఇవ్వాల (సోమవారం) జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జార్కిహోళి మాట్లాడారు. కాగా, ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ, సోషల్ మీడియా వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు విమర్శలు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన బీజేపీ నేత ప్రకాశ్​ సీరియస్​ అయ్యారు. ఇది చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హిందువులను అవమానించేలా మాట్లాడుతోంది. ఇంతకు ముందు సిద్ధరామయ్య కూడా అదే పని చేశారు. ఇప్పుడు ఆయన అనుచరుడు, మాజీ మంత్రి సతీష్ జార్కిహోళి కూడా అదే చేస్తున్నారు.. అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ట్విట్టర్‌లో కాంగ్రెస్ నాయకుడి వాదనను కొందరు సమర్థించగా, చాలామంది ట్రోల్​ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement