Friday, May 10, 2024

స్థానికులకే 75శాతం ఉద్యోగాలు..  ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు..

ప్రైవేట్ ఉద్యోగాల్లో డొమిసైల్ రిజర్వేషన్ అమలుపై స్టే విధిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇవ్వాల ఆదేశాలు జారీ చేసింది. హర్యానా  రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం హర్యానా పౌరులకు రిజర్వ్ చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హర్యానా ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగంలోని నిబంధనలకు,  మెరిటోక్రసీ యొక్క ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని గుర్గావ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తన పిటిషన్‌లో పేర్కొంది.

 డొమిసైల్ జాబ్ రిజర్వేషన్ అంటే..

హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్​ క్యాండిడేట్స్​ యాక్ట్​ 2020 ప్రకారం.. ఈ ఏడాది జనవరి 15 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం.. గరిష్టంగా నెలవారీ జీతం రూ. 30వేలు ఇవ్వాలనే రూల్​ ఉంది. ప్రైవేటు ఉద్యోగాలకు ఈ చట్టం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇది హర్యానాలోని ప్రైవేట్ కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు,  భాగస్వామ్య సంస్థలకు వర్తిస్తుంది.  ఈ కోటా ప్రకారం.. వేలాది మంది యువతకు కొత్త ఉపాధి మార్గాలు లభిస్తాయని  హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ, హైకోర్టు కోట్టేయడంతో మళ్లీ యువతకు ఉపాధి ఆందోళనకరంగా మారనుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement