Friday, May 17, 2024

ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చూడాల‌ని ఉంది – కృష్ణంరాజు

హీరో ప్ర‌భాస్ త్వ‌ర‌గా పెళ్లి చేసుకుంటే చూడాల‌ని ఉంద‌ని తెలిపారు ఆయ‌న పెద‌నాన్న‌, న‌టుడు కృష్ణంరాజు. ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’ భారీగా వ‌సూళ్లు రాబ‌డుతోన్న నేప‌థ్యంలో కృష్ణంరాజు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…ప్రభాస్‌కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉంద‌ని అన్నారు. కృష్ణంరాజు తొలిసారి ఇలా త‌న‌ మనసులో మాటను బయటపెట్టారు. కాగా, ‘రాధేశ్యామ్‌’ సినిమా చాలా బాగుందని కృష్ణంరాజు అన్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపారు. బాలీవుడ్ దిగ్గ‌జ‌ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌ ‘రాధేశ్యామ్‌’పై ప్రశంసలు కురిపించార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement