Sunday, June 9, 2024

Helping Hands – స్పందించిన హృద‌యాలు… బాలుడికి బాసటగా… క్రౌండ్​ ఫండింగ్​ …


22 నెల‌ల బాలుడికి అరుదైన వ్యాధి
ఒక్కో ఇంజెక్ష‌న్ ఖ‌రీదు రూ.17.50 కోట్లు
నిరుపేద కుటుంబం.. సాయం చేయాల‌ని అర్థింపు
స్టార్ నుంచి సామాన్యుల వ‌ర‌కు ముందుకు వ‌చ్చి సాయం
నెల వ్య‌వ‌ధిలోనే క్రౌడ్ ఫండ్ రూపంలో స‌మ‌కూరిన మొత్తం
దిగ్విజ‌యంగా చిన్నారికి అందిన ఇంజెక్ష‌న్

చిన్నప్ప‌టి నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్న 22నెలల చిన్నారికి వైద్యులు జీవం పోశారు. నాలుగు నెలల నుంచి వెన్నెముక కండరాల క్షీణత టైప్-వన్‌తో చిన్నారి హృదయాంశ్ బాధపడుతున్నారు. ఈ వ్యాధి నయం కావాలంటే రూ. 17.5 కోట్లు విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయితే బాలుడి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అంత మొత్తాన్ని భరించే స్థితిలో లేరు. మాన‌వ‌తా ద‌`క్ప‌థంతో ముందుకు వ‌చ్చిన కొంద‌రి సహాయంతో ఇంజెక్షన్ ల‌భించడంతో అతని ప్రాణాల‌ను కాపాడారు. ఈ క్ర‌తువులో కూరగాయల అమ్మేవాళ్ల దగ్గర నుంచి దేశంలోని సూపర్ స్టార్ల వరకు అందరూ సహాయం చేశారు.

- Advertisement -

ఖ‌రీదైన ఇంజెక్ష‌న్‌..
హృదయాంశ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నయం కావాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లలో ఒకటైన జన్యు ఆధారిత చికిత్సకు ఉపయోగించే జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ కావాలి. 17.50 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇది. ఈ విష‌యం విన్న వెంటనే ఎవరికైనా ధైర్యం కోల్పోవడం సాధారణం. కానీ హృదయాంశ్ విషయంలో ప్రజలు తమలోని మానవత్వాన్ని తట్టి లేపారు. దీంతో అనతికాలంలోనే ఇంత పెద్ద మొత్తం కూడా చిన్నదిగా కనిపించడం ప్రారంభించింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అతనికి సహాయం చేయడానికి చిన్నా పెద్దా అందరూ ముందుకు వచ్చారు. క్రికెటర్లు దీపక్ చాహర్, సర్ఫరాజ్ కూడా హృదయాంశ్‌కు సహకరించారు. దీంతో దినసరి కూలీలు, పోలీసులు కూడా తమ వంతు సాయం అందించారు. మొదటిసారిగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా రాజస్థాన్ పోలీసులకు ఇంత పెద్ద ఎత్తున సహాయం అందించారు. ఈ ఖరీదైన ఇంజెక్షన్ కోసం అందరూ సహాయం చేసి డబ్బు సమకూర్చారు.

త‌ప్పిన ప్రాణాపాయం
దీంతో జేకే లోన్ హాస్పిటల్‌లోని అరుదైన వ్యాధి విభాగం ఇన్‌ఛార్జ్ డాక్టర్ ప్రియాంషు మాథుర్, అతని బృందం అమెరికా నుండి జోల్ జెనెస్మా ఇంజెక్షన్‌ను దిగుమతి చేసుకుని హృదయాంశ్‌కు అందించారు. ప్రస్తుతం ఇంజెక్షన్ ఇచ్చిన త‌ర్వాత హృదయాంశ్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. అత‌నికి ఎటువంటి ప్రాణాపాయం లేద‌ని చెప్పారు.. త‌మ కుమారుడిని ర‌క్షించేందుకు సాయం చేసిన అంద‌రికి త‌ల్లిదండ్రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement