Tuesday, May 7, 2024

యూపీలో జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు.. రోజుకి రూ.115కోట్ల ఆదాయం

ఈ మ‌ద్య‌కాలంలో మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా జ‌రుగుతున్నాయి. అయితే ఓ రాష్ట్ర ప్ర‌జ‌లు మాత్రం రోజుకి రూ.115కోట్ల మ‌ద్యాన్ని తాగేస్తున్నార‌ట‌. ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్‌, బీర్‌ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాల ప్రజలు ప్రతి రోజూ రూ.12 నుంచి రూ.15 కోట్ల విలువైన మద్యం, బీరు వినియోగిస్తున్నారని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అధికార గణాంకాల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌లో సగటున రోజుకు రూ.4.5 కోట్ల విలువైన మద్యం, బీరు అమ్మకాలు జరుగుతున్నాయి.

నోయిడా, ఘజియాబాద్‌లో రోజుకు రూ.13 నుంచి రూ.14 కోట్లు, ఆగ్రాలో రూ.12 నుంచి రూ.13 కోట్లు, మీరట్‌లో నిత్యం సుమారు రూ.10 కోట్లు, రాజధాని లక్నోలో రూ.10 నుంచి రూ.12 కోట్లు, కాన్పూర్‌లో రోజుకు రూ.8 నుంచి రూ.10 కోట్లు, వారణాసిలో ప్రతి రోజూ రూ.6 నుంచి రూ.8 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.కాగా గత రెండు మూడేళ్లలో ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో లిక్కర్‌, బీరు వినియోగం బాగా పెరిగిందని ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మొత్తం ఆదాయంలో దేశీయ మద్యం వాటా 45 నుంచి 50 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు, మద్యం అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడం వంటివి లిక్కర్‌ అమ్మకాల పెరుగుదలకు కారణమని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement