Monday, October 14, 2024

Gulab Cyclone: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు

గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈరోజూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం… ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. సహాయక చర్యల కోసం జిల్లాల వారీగా కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement