Wednesday, May 8, 2024

Breaking: హైదరాబాద్​లో భారీ వర్షం.. గంటసేపటి నుంచి వీడని వాన!

హైదరబాద్​లో ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడుతుండగా.. మరికొన్ని చోట్ల కుండపోత వాన కురుస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల దాకా చిటపట చినుకులతో కూల్​ కూల్​గా ఉన్న వెదర్​ రాత్రి 7 గంటల తర్వాత మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

ఇక.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సాయంత్రం నుంచే హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్​లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. చల్లబడ్డ వాతావరణంతో సిటీ జనం కాస్త ఊరటపొందుతున్నారు. కూల్​ వెదర్​ని ఎంజాయ్​ చేస్తూ సేద తీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement