Thursday, May 9, 2024

దేశంలో ముస్లింలను ద్వేషించడం కామన్​ అయ్యింది: ఓమర్​ అబ్దుల్లా

దేశంలో ముస్లింల పట్ల ద్వేషం సర్వ సాధారణమైందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. కర్నాటక రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ‘హిజాబ్’కు వ్యతిరేకంగా నిరసనలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ఒక కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్​ శాఫ్రాన్​ కండువాలు మెడలో వేసుకుని ‘హిజాబ్’ ధరించిన మహిళను హేళన చేస్తూ నినాదాలు చేయడం సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. దీనిపై ఆయన వ్యాఖ్యానించారు.

ఈ స్టూడెంట్స్​ ఎంత ధైర్యవంతులు, ఒంటరి యువతిని టార్గెట్​ చేసుకుని వారు అదోరకమైన అనుభూతి చెందుతున్నారు.! ముస్లింల పట్ల ద్వేషం అనేది ఇప్పుడు దేశంలో కామన్​ అయిపోయింది. అని ఒమర్​ వ్యాఖ్యానించారు. భారత దేశం అంటేనే భిన్న మతాల కలయిక.. కుల, మత వైవిధ్యం ఉంది.. కానీ, ఇప్పుడా పరిస్థితి  లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులనై వారిపై యాక్షన్​ తీసుకోవాలని ఆయన కోరుతూ ఒమర్​ మిస్టర్ అబ్దుల్లా వీడియోను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్‌లో తెలిపారు.

కాగా, వారం రోజుల నుంచి కర్నాటకలోని ఉడిపి, శివమొగ్గ, బాగల్‌కోట్,  ఇతర ప్రాంతాల్లోని కొన్ని విద్యాసంస్థల వద్ద ‘హిజాబ్’ సమస్యపై ఉద్రిక్తత నెలకొంది. అది కాస్త ఇవ్వాల మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో  పోలీసులు, ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ- యూనివర్శిటీ కళాశాలలో చదువుతున్న ఐదుగురు బాలికలు కాలేజీలో హిజాబ్ నియంత్రణను ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కర్నాటక హైకోర్టు ఇవ్వాల విచారణకు స్వీకరించింది.

ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో జనవరిలో ఈ సమస్య మొదలైంది. అక్కడ తలకు కండువాలు ధరించి తరగతులకు హాజరైన ఆరుగురు విద్యార్థులను క్యాంపస్ వదిలి వెళ్లాలని కోరారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. హిందూ యువకులు, రైట్‌వింగ్‌ల మద్దతుతో కాషాయ కండువాలు ధరించి హిజబ్​లతో వచ్చేవారిని అడ్డుకుంటున్నారు.  ఇది కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా మత వివాదానికి దారితీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement