Saturday, May 18, 2024

హ్యారీపోటర్‌ నటుడు -రాబీ కోల్ట్రేన్‌ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబీ కోల్ట్రేన్‌ మృతి చెందారు. ఆయన వయసు 72యేళ్లు. హ్యారీపోటర్‌ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ల్రేన్‌ సుపరిచితుడే.థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన రాబీ కోల్ల్రేన్‌ ఫ్లాష్‌ గార్డాన్‌ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. హ్యారీ పోటర్‌ సిరీస్‌కు ముందు రాబీ కోల్ట్రేన్.. 1990లో వచ్చిన టీవీ సిరీస్ క్రాకర్‌లో హార్డ్-బీటెన్‌ డిటెక్టీవ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీటితో పాటుగా జేబ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాల్లో నటించాడు. రాబీ వరుసగా మూడు సార్లు ఉత్తమ నటుడిగా BAFTA TV అవార్డులు గెలుచుకున్నాడు. ఈ సినిమాల్లో హాగ్రిడ్‌ పాత్రతో రాబీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈయన స్కాట్లాండ్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. కారణాలేంటో తెలియదు కాదు ఈయన మృతిపై పలువురు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement