Thursday, April 25, 2024

హ‌ర్భ‌జ‌న్ సింగ్ దంప‌తులకి క‌రోనా

మాజీ క్రికెటర్ , ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ దంప‌తులు క‌రోనా బారిన ప‌డ్డారు. హ‌ర్భ‌జ‌న్ తో పాటు ఆయ‌న భార్య గీతాబ‌స్రాకు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ విషయాన్ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ భార్య గీత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ వైరస్ నుంచి రెండేళ్లుగా తప్పించుకునేందుకు ప్రయత్నించాం… అయినా మమ్మల్ని పట్టుకుంది అంటూ ట్విట్టర్ లో రాసుకోచ్చింది. మరోవైపు బజ్జీ తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇంట్లోనే హోం క్వారంటైన్ అయ్యానని.. నాతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రోజూవారీ కేసుల సంఖ్య 3.5 లక్షలను దాటింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement