Friday, May 10, 2024

GVL: ఆంధ్ర సంప్రదాయాలపై నిషేధం ఉందా?

ఏపీ సర్కార్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా జరుపుకునేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో గుడివాడ వెళుతున్న బీజేపీ బృందాన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. సంక్రాంతి సంప్రదాయాలపై నిషేధం ఉందా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. అర్ధనగ్న డ్యాన్సులకు “ఊ” అంటూ, ముగ్గు పోటీలకు “ఊఊ” అంటారా? అని మండిపడ్డారు. కొంతమంది IPS అధికారులు YPS (వైసీపీ పోలీస్ సర్వీస్)గా పనిచేస్తున్నారని ఆరోపించారు.

సంప్రదాయాలను కాపాడేందుకు ఆందోళనలు ఉధృతం చేస్తామని జీవీఎల్ హెచ్చరించారు. గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్ తదితర బీజేపీ నేతలు విజయవాడ నుంచి బయల్దేరారు. అయితే గన్నవరం సమీపంలో నందమూరు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో సోము వీర్రాజుతోపాటు పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement