Sunday, May 5, 2024

పాఠ్యాంశంగా భ‌గ‌వ‌ద్గీత.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

గురజాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ్యాంశంగా భ‌గ‌వ‌ద్గీతను పాఠ్యాంశంగా చేర్చి 6 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బోధ‌న‌ చేయనుంది. 2022-23 విద్యా సంవత్సరం నుండి 6 నుండి 12 తరగతులకు భగవద్గీత పాఠశాల సిలబస్‌లో భాగం అవుతుంది. ఈ మేరకు గుజ‌రాత్ విద్యా శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. విద్యాశాఖకు బడ్జెట్‌ కేటాయింపులపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా విద్యాశాఖ మంత్రి జితు వాఘాని ఈ విషయాన్ని ప్రకటించారు. 1వ తరగతి నుండి ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేస్తామని, ద్విభాషా బోధనా మాధ్యమాన్ని అమలు చేస్తామని తెలిపారు. అలాగే, 6వ తరగతి నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల పాఠ్యాంశాల్లో భగవద్గీతను ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇవి జాతీయ విద్యా విధానం 2020 అమలులో భాగమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement