Saturday, May 18, 2024

Breaking: ఢిల్లీ ప్రజలకు గుడ్​న్యూస్​.. 4 రోజుల తర్వాత వానలుంటయ్​

ఢిల్లీ ప్రజలకు గుడ్​న్యూస్​.. ఈ నెల 11 నుంచి హీట్​వేవ్​ సిచ్యుయేషన్​ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను వాతావరణశాఖ తీసుకొచ్చింది. అయితే.. అప్పటిదాకా అంటే మరో నాలుగు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో టెంపరేచర్లు 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల దాకా పెరుగుతాయని సీనియర్​ సైంటిస్ట్​ ఆర్​కే జెనామణి తెలిపారు.  జూన్ 9 వరకు కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని జెనామణి చెప్పారు. ఆ తర్వాతకొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై.. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  

“ఢిల్లీలో ఉష్ణోగ్రత 44 నుండి 46 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. జూన్ 8 నుండి 9 వరకు పలు ప్రదేశాలలో వేడిగాలుల తీవ్రత బాగానే ఉంటుంది. జూన్ 11నుంచి వానలు పడే అవకాశాలున్నాయి. వేడిగాలులు తగ్గుముఖంపడతాయి” అని జెనామణి చెప్పారు. ఇక.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఎండల తీవ్రత వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. రాబోయే మూడు రోజుల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. పాకిస్తాన్ దిశ నుండి వీస్తున్న పొడి, వెచ్చని గాలుల ప్రభావంతో జూన్ 9 వరకు కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 44.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా, ఉత్తరప్రదేశ్‌లోని బందా, ఫతేఘర్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీలుగా రికార్డు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement