Friday, May 10, 2024

ఆంధ్రా కొడైకెనాల్ ని అభివృద్ధి చేయ‌రా..? ప్రభుత్వం తీరుపై టూరిస్టుల అసంతృప్తి..

అరకులోయ రూరల్‌, ,ప్రభన్యూస్‌: పర్యాటక స్వర్గధామంగా పిలువబడుతున్న ఆంధ్రా ఊటీ అందాల అరకులోయ అభివృద్ధిపై నీలినీడలు అలు ముకున్నాయి. ప్రభుత్వాలు పాలకులు మారుతున్న అరకులోయ అభివృద్ధి దిశ మారడం లేదు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా ఊటీగా అందాల అరకులోయ పర్యాటక స్వర్గధామంగా ప్రపంచ పర్యాటకుల ప్రేమికుల స్వర్గంగా ఉన్న అరకులోయ నేడు అధికారుల అలసత్వానికి పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ వస్తుంది. తమిళనాడు ప్రాంతంలో కొడైకెనాల్‌ ఊటీ ప్రాంతాల్లో ఉన్న అనేక అందాలు ఇక్కడ సాత్‌ హరిస్తున్నాయి. అయితే ఏప్రభుత్వం కూడా అరకులోయ అందాలు అభివృద్ధిని పట్టించు కోకపోవడంతో ఇక్కడి అందాలు అడవికాచిన వెన్నెలవలే అవుతున్నాయి. ప్రతి ఒక్కరు అరకులోయ అంటే పర్యాటక భూతల స్వర్గం అని అందాలమయమని చెప్పుకుంటూ ఉంటారు. అందుకు తగినట్లే పర్యాటకులకు సంబంధం లేకుండా ఇక్కడ అరకు అందాలు దర్శనమిస్తాయి. అందుకే దేశ విదేశీ పర్యాటకులు సీజన్‌తో సంబంధం లేకుండా అరకులోయ అందాల వీక్షణకు తరలివస్తుంటారు. అరకు అంటేనే ఒక అద్భుతం అందాల స్వర్గధామం పర్యాటకుల భూతల స్వర్గం ఇటువంటి అరకులోయ అందాలను ఏవిధంగా వర్ణించగలం అయితే ప్రభుత్వం అరకులోయ అందాలపై సీతకన్ను వేసిందని చెప్పక తప్పదు. తమిళనాడులో ఊటి లాగా ఆంధ్రాకు అరకులోయ పర్యాటక స్వర్గధామం అయితే పాలకులు పట్టించుకోక పోవడం వలన అరకు అందాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించ లేకపోతుంది.

పత్రికల్లో మీడియాలో అందాలపై కథనాలు వెలువడుతున్నాయి. అరకు అద్భుత అందాలపై పర్యాటకులు ప్రశంసిస్తూ పాలకులకు ఎటువంటి చలనం ఉండడం లేదు. నిజంగా అరకు అందాలు అద్భుత ఆలయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈప్రాంతం అభివృద్ధి చెందలేదని నిత్యం సీజన్తో సంబంధం లేకుండా పర్యాటకులు వచ్చేవారని చిరువ్యా పారులు నిరుద్యోగులు ఉపాధి పొందే వారని ఈప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు. అరకులోయ అందాలు ఆరు,ఏడు దశాబ్దాల క్రితమే తెలుగు సినీ పరిశ్రమలు ఓ వెలుగు వెలిగాయి. అప్పటినుండి తెలుగు సినీ పరిశ్రమ ప్రతియేటా అరకు లోయలో విరివిగా షూటింగులు జరుపుకునేవి అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం అభివృద్ధి జరగకపోవడం వలన తెలుగు సినీ పరిశ్రమ అరకులోయ వైపు కన్నెత్తి చూడటం లేదు. గతంలో రోజుకు ఐదు, ఆరు షూటింగ్‌లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ కూడా జరగడం లేదు దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు, అధికారులు స్పందించి ఆంధ్రా ఊటీ అందాల అరకులోయ అభివృద్ధికి చేపట్టవ లసిన చర్యలు తీసుకోవాలని అలాగే పర్యాటకుల తరచు సీజన్తో సంబంధం లేకుండా సందర్శించేలా కృషి చేయాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని ఈప్రాంత ప్రజలతో పాటు గిరిజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement