Friday, May 17, 2024

మ‌ద్యం ప్రియుల‌కి శుభ‌వార్త – ఆన్ లైన్ లో ఆల్క‌హాల్ – ఆర్డ‌ర్ చేసిన ప‌ది నిమిషాల‌కే డెలివ‌రీ

ఇప్ప‌టికే ఆన్ లైన్ లో ఎన్నో అందుబాటులోకి వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ద్యం కూడా ఆన్ లైన్ లో దొర‌క‌నుంది. హైద‌రాబాద్ కి చెందిన ఓ స్టార్ట‌ప్ కంపెనీ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇంకేముంది దీనికో పేరు కూడా క్రియేట్ చేసి రంగంలోని దిగింది. ’బూజీ‘ బ్రాండ్ పేరుతో కోల్ క‌త్తాలో వినూత్న సేవలను తాజాగా ప్రారంభించింది. ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో లిక్కర్ ను డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. మరి ఇప్పటివరకు ఆన్ లైన్ లో మద్యం అందుబాటులో లేదా అంటే.. ఎందుకు లేదూ… వాస్తవానికి ఇప్పటికే పలు కంపెనీలు ఆన్లైన్ లో మద్యం డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే.. మద్యం మీ ఇంటిముందుకు చేర్చే సేవలను అందిస్తున్న కంపెనీ మాత్రం తమదేనని ఎండోమెంట్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికోసం పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సర్వీసును ప్రారంభించినట్లు వెల్లడించింది. మ‌ద్యం ప్రియుల‌కి పండ‌గే.

Advertisement

తాజా వార్తలు

Advertisement