Sunday, April 21, 2024

Breaking: కాంగ్రెస్ కు మహేశ్వర్ రెడ్డి గుడ్ బై.. కమలం గూటికి చేరనున్న నేత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. తనకు అనవసరంగా షోకాజ్ ఇవ్వడం పట్ల ఆగ్రహంతో ఉన్న మహేశ్వర్ రెడ్డి గత రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఖర్గే తో కలిసి మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే నేటి ఉదయం ఆకస్మికంగా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, తరుణ్ చుగ్ లతో భేటి అయిన మహేశ్వర్ రెడ్డి.. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక లేఖను ఖర్గేకు పంపారు. గత కొంతకాలంగా మహేశ్వర్ రెడ్డి కమలం గూటికి చేరుతారనే వార్తల నేపథ్యంలో నేడు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఆయన సమక్షంలోనే కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement