Thursday, April 25, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌..

బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి.. ఏకంగా 10గ్రాములు రూ.60,050 మార్కును తాకడం ఆందోళన కలిగిస్తోంది.
దేశీయంగా చూస్తే బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ.600 మేర పెరిగి.. రూ.53,600 మార్కుకు చేరింది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం. ఇక 24 క్యారెట్ల గోల్డ్ (మేలిమి బంగారం) రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.58,470 మార్కును తాకింది. రూ.58 వేల మార్కును దాటడం హైదరాబాద్‌లో ఈ మధ్య అస్సలు చూసుండరు. ఇదే లెక్కన ఇక్కడ కొద్దిరోజుల్లో రూ.60 వేల మార్కును చేరే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.దిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. 22 క్యారెట్లకు రూ.600 మేర పెరిగి ప్రస్తుతం తులం బంగారం ధర రూ.53,750 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.58,610 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో చూస్తే బంగారం ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఒక్కరోజే ఏకంగా రూ.900 పెరిగి ప్రస్తుతం రూ.55,050 మార్కు వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement