Sunday, May 26, 2024

చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.కోటి విలువైన బంగారం పట్టివేత

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం రెండు కిలోల బంగారం పట్టుబడింది. దుబాయి ప్రయాణికుల కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వెంటనే ఇద్దరు ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ.కోటి విలువ చేసే రెండు కిలోల బంగారం.. విదేశీ మద్యం, విదేశీ సిగరెట్లు బయటపడ్డాయి. ఇద్దరు ప్రయాణీకులను అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement