Thursday, April 25, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం రేటు విషయానికి వస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.52,200 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర అదే 10 గ్రాములకు రూ.56,950 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అంతకుముందు రోజు 10 గ్రాములకు రూ.400 పెరిగింది. దానికి ముందు వరుసగా 5 రోజులు ధరలు పడిపోయాయి. దిల్లీలో బంగారం రేటు ప్రస్తుతం 22 క్యారెట్ 10 గ్రాములకు రూ. 52,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్ బంగారం ధర రూ.57,100 కు చేరింది. మరోవైపు వెండి రేటు కూడా ఇటీవల పడిపోయింది. కిలో వెండి రేటు దిల్లీలో ప్రస్తుతం రూ.68,600 వద్ద ఉండగా.. ఇదే హైదరాబాద్‌లో రూ.71,800 మార్కు వద్ద ఉంది. దిల్లీతో చూస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువ, సిల్వర్ రేటు కాస్త ఎక్కువ ఉంటాయి. స్థానిక పన్నులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం ధర పడిపోతుంది కాబట్టి.. ఇన్వెస్టర్లు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement