Friday, May 17, 2024

పెరిగిన బంగారం..తగ్గిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.  బంగారం ధర గత రెండు రోజులుగా పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబా‌ద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర మరో రూ.100 పెరిగి రూ.47,100కు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్‌లో తులం రూ.51,280 పలుకుతోంది. ఇక సిల్వర్ విషయానికి వస్తే గత వారం వ్యవధిలో రూ.3500 మేర పెరిగిన వెండి ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1000 మేర పతనమైంది. దీంతో రేటు 63 వేల 500 రూపాయలకు తగ్గింది. అక్టోబర్ 21న రూ.500, 22న రూ.1700, అక్టోబర్ 25న 300 రూపాయలు, 26న రూ.1000 ఇలా వరుసగా పెరుగుకుంటూ వెళ్లడం గమనార్హం.

దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కాస్త ఊరట లభించింది. అయితే ఈ రేట్లు పెరగక ముందు వెండి చౌకగా లభించింది. కిలో రూ.60 వేల దిగువకు చేరడం విశేషం. ఆ మధ్య ఏకంగా వారం రోజుల్లో రూ.6500 మేర వెండి రేటు తగ్గింది. ఇక బంగారం, వెండి రేట్లు ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, అక్కడి పన్నులను బట్టి కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. కొనే ముందు స్వచ్ఛతను నిర్ధరించుకోండి. హాల్‌మార్క్ ఉన్న వాటినే కొనండి. రానున్న కార్తికమాసంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెళ్లిళ్ల సీజన్. డిమాండ్ ఎక్కువై మళ్లీ ధరలు పెరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement