Saturday, April 27, 2024

స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర ఎలాంటి మార్పూ లేకుండా రూ.48,550 వద్ద ఉంది. నవంబర్ 25న ఒక్కరోజు పెరగ్గా.. అంతకుముందు వరుసగా ఐదు రోజులు పడుతూనే వచ్చాయి. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,970 వద్త కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం పడిపోయాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే రూ.500 తగ్గి.. రూ.67,500కు చేరింది. అంతకుముందు 3 రోజుల్లో మాత్రం ఏకంగా 1700 పడిపోయింది. అయినప్పటికీ ఇవి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లే. ఈ నెల ప్రారంభంలో కిలో వెండి రూ.64,000 వద్ద ఉండటం గమనార్హం. సిల్వర్ రేటు ఇంకా దేశ రాజధానిలో చాలా తక్కువలోనే ఉంటుంది. స్థానిక పరిస్థితులు, పన్నులను బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement