Friday, May 3, 2024

నేటి బంగారం ధరలు..స్థిరంగా వెండి

నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47 వేల 10 వద్ద ఉంది. ఇదేం మారలేదు. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు కూడా రూ.51 వేల 290 వద్ద స్థిరంగా ఉంది. అక్టోబర్ 22న రూ.750, 23న రూ.10 చొప్పున బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇక సిల్వర్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రూ.63 వేల 200 వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే రేట్లు ఉన్నాయి. కొద్దిరోజుల ముందు వరకు అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆయా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోయాయి. తొలుత యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచగా ఆ తర్వాత దాదాపు అన్నీ అదే బాటలో పయనించాయి. దీంతో డాలర్ పెరిగి.. బాండ్లపై ప్రతిఫలాలు పెరగ్గా.. ఇతర కరెన్సీలు కుప్పకూలాయి. ఇదే క్రమంలో బంగారం డిమాండ్ పడిపోయింది. అంతర్జాతీయంగా ధరలు పతనమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement