Friday, May 10, 2024

బంగారం కొనేందుకు మంచి తరుణం.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.అంతర్జాతీయంగా రేట్లు తగ్గిన నేపథ్యంలోనూ దేశీయంగానూ అదే ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర తగ్గింది. దీంతో తులం రూ.46 వేల 700కు చేరింది. అంతకుముందు రోజు ఇది రూ. 46 వేల 850 వద్ద ఉండేది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ హైదరాబాద్‌లో రూ.160 మేర తగ్గి రూ. 50 వేల 950కి పడిపోయింది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.500 తగ్గి రూ.64 వేలకు చేరింది. వరుసగా రెండు రోజులు రూ.500 చొప్పున రేటు పడిపోవడం గమనార్హం. అంతకుముందు మాత్రం ఒకే రోజు కిలో వెండి ధర రూ.2000 మేర పెరిగింది. అయితే ఆయా ప్రాంతాల పరిస్థితులు, అక్కడి పన్నులను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయి. అందుకో కొనేముందు ఓసారి చూసి కొనుగోలు చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.. రేట్లు భారీగా పడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement