Friday, April 26, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి ప్రస్తుతం రూ.56,650 వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 ఎగబాకి రూ.61,800 మార్కుకు చేరింది. మరోవైపు దిల్లీలోనూ బంగారం రేటు పెరిగింది. దిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు ప్రస్తుతం రూ. 150 పెరగ్గా రూ.56,800 మార్కును తాకింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.61,950కి చేరింది. బంగారం ధర పెరుగుతున్నా వెండి రేటు మాత్రం వరుసగా 4 రోజులుగా తగ్గుతోంది.

ప్రస్తుతం దిల్లీ మార్కెట్‌లో కిలో వెండి రూ.200 తగ్గగా ఇప్పుడు రూ.74,800కు చేరింది. ఇక హైదరాబాద్‌లోనూ తాజాగా రూ.200 తగ్గగా కిలోకు రూ. 78,500కు చేరింది. గత 3 రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో వెండి రేటు కిలోకు రూ.4200 మేర తగ్గడం శుభపరిణామం. ఇదే సమయంలో గోల్డ్ రేటు మాత్రం పెరిగింది. ఇక బంగారం, వెండి రేట్లు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు వీటిని ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌తో చూస్తే దిల్లీలో వెండి రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇక బంగారం ధర మాత్రం ఇక్కడికంటే అక్కడే ఎక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement