Friday, April 19, 2024

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేటి రేట్లు ఇలా..

పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్. బంగారం ధర మరోసారి పరుగులు పెట్టింది. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.47,680కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.100 పెరుగుదలతో రూ.43,700కు చేరింది. అయితే, వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి రేటు రూ.200 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,300 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండిః కడప ఎస్పీకి లేఖ రాసిన వివేకా కుమార్తె

Advertisement

తాజా వార్తలు

Advertisement