Wednesday, May 8, 2024

Gold Rate: దడ పుట్టిస్తున్న పసిడి రేటు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి రేటు ఏకంగా రూ. 2 వేలకు పైగా పెరిగింది. తెలుగురాష్ట్రాల్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ.54,330కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ. 49,800కు చేరింది. వెండి ధర రూ.2,100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 76,700కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement