Friday, May 17, 2024

Gold News: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గూడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి దిగొచ్చాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48 వేలకు చేరింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.52,370కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ వెండిపై వెయ్యి రూపాయల మేర ధర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69 వేలకు పడిపోయింది. మరో నాలుగు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో.. తగ్గుతోన్న ధరలు దేశీయంగా మహిళలకు శుభవార్తగా నిలుస్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement