Tuesday, May 21, 2024

Gold Rates: నిలకడగానే బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్​లో ఇవ్వాల్టి గోల్డ్​ రేట్​ ఎంతంటే..

బంగారం ధ‌ర‌లు రెండ్రోజులుగా స్థిరంగా ఉన్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 47,750 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 వద్ద ట్రేడ్​ అవుతోంది. అయితే వెండి రేటు కూడా నిన్నటి ధరే (67వేలు) ఇవ్వాల కొనసాగుతోంది. కాగా, విజయవాడలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.47,750 వద్ద రికార్డయింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

అయితే ఈ వారమంతా చూసుకుంటే బంగారం ధరలలో పెరుగుదల నమోదైంది. వారం ప్రారంభంలో అంటే మే 23, 2022న 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.47,150గా ఉంటే.. వారం చివరిలో నేడు ఆ ధర రూ.47,750గా రికార్డయింది. అంటే రూ.600 మేర ఈ ధర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా రూ.51,430 నుంచి రూ.52,090కు ఎగిసింది. ఈ ధరలో కూడా రూ.660 మేర పెరుగుదల నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement