Thursday, April 25, 2024

Gold Price: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ప్రియులకు బంగారం ధర షాక్ ఇచ్చింది. బంగారం ధర మళ్లీ పైకి కదిలింది. బంగారం దారిలో వెండి రేటు కూడా పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,310కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.45,200కి చేరింది. ఇక, వెండి ధర కూడా బంగారం దారిలో పయనించింది. వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,300కు ఎగసింది.

ఇది కూడా చదవండి: కుప్పం ఘటన కేసు: టీడీపీ నేతలకు ఊరట

Advertisement

తాజా వార్తలు

Advertisement