Wednesday, May 1, 2024

సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

ఒకటో తేదీ సామాన్యులకు మళ్లీ షాక్ ఇచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచేశాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. ధరల పెంపు ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండోసారి. సిలిండర్ ధర పెంపు నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884కు చేరింది.

ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండేది. ఇప్పుడు రూ.884కు చేరింది. గత ఏడేళ్ల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అవ్వడం గమనార్హం. 2014 మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వద్ద ఉండేది. అదేసమయంలో ఈరోజు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.75 పైకి కదిలింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. రూ.975 వరకు చెల్లించుకోవాలి. ఇందులో సిలిండర్ బుకింగ్ ధర రూ.945. దీనికి డెలివరీ బాయ్ తీసుకునే రూ.30 జత చేస్తే.. రూ.975 అవుతుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ వస్తుంది.

ఈ వార్త కూడా చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement