Wednesday, February 28, 2024

Hyderabad: మునావార్​ షోకి ఫుల్ ప్రొటెక్షన్​​.. శిల్పకళా వేదిక వద్ద పోలీసు బందోబస్తు

హైదరాబాద్​లోని మాదాపూర్ (హైటెక్ సిటీ)లో స్టాండప్ కమెడియన్ మునవర్ ఫరూఖీ ప్రదర్శన ఇవ్వబోతున్న శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టారు. రైట్‌వింగ్ గ్రూపుల నుండి ఇబ్బందులను ఊహించి పోలీసు అధికారులు ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల పోలీసుల బలగాలను మోహరించారు. సైబరాబాద్ పోలీసులు వేదిక వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సఫారీ డ్రెస్‌లు ధరించిన ప్రత్యేక బృందాలు కార్యక్రమ వేదిక దగ్గర కనిపించారు. అదేవిధంగా శిల్పకళా వేదిక వద్దకు వెళ్లే వేదిక, రోడ్ల చుట్టూ యూనిఫాం ధరించిన పోలీసులను కూడా మోహరించారు. ఏదైనా అత్యవసర అవసరానికి సమీపంలో అగ్నిమాపక యంత్రాన్ని కూడా ఉంచారు.

సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. మునావర్ ఫరూఖీపై ఎలాంటి అంతరాయం లేదా దాడి జరగకుండా ఉండేందుకు పోలీసులు సాధారణ దుస్తుల్లో గస్తీ కాస్తున్నారు. శిల్ప కళావేదికలో క్లోజ్డ్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. టెలివిజన్ సెట్‌లు, కంప్యూటర్‌లలో జరుగుతున్న సంఘటనలను ఒక బృందం పర్యవేక్షిస్తోంది. ఈ ఫీడ్ మొత్తం సైబరాబాద్ పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్​ అవుతుంది. భద్రతా చర్యలుగా మునావర్ ఫరూఖీ ప్రదర్శనను చూడటానికి వెళ్లేవారు తమ ఫోన్‌లను సీలు చేసిన పర్సులో ఉంచుకోవాలి.

ముప్పు కారణంగా హాజరయ్యేవారిపై ఆంక్షలు

అక్కడికి వచ్చే వారికి పోలీసులు కొన్ని కండిషన్స్​ పెట్టారు. సందర్శకులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వేదిక లోపలికి ఎవరూ వెళ్లకుండా ప్రవేశ ద్వారం దగ్గర బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందు బీజేపీ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ప్రదర్శనను రద్దు చేసి, అంతరాయం కలిగించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో నిరసన తెలిపేందుకు శిల్పకళా వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను హైదరాబాద్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మునావర్ ఫరూకీ తన ప్రదర్శనను ప్రకటించినప్పటి నుండి, రాజాసింగ్ కామిక్‌ను టార్గెట్​ చేసకుని వ్యాఖ్యలు చేస్తున్నారు.

అతను విడుదల చేసిన వీడియోలలో సెట్‌ను ‘కాల్చివేయడానికి’ వెనుకాడను అని ఎమ్మెల్యే రాజాసింగ్​ చెప్పడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. మునావర్ ఫరూఖీ తన ఒక షోలో రాముడు, సీతను అవమానపరిచే సూచనలు చేశాడనే ఆరోపణలతో రైట్ వింగ్ గ్రూపుల నుండి నిరసన ఎదురవుతోంది. అతడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో ఫరూఖీ విడుదలయ్యారు.

ఇక.. రాజా సింగ్ తన మద్దతుదారులు ఫరూకీ షోకి టిక్కెట్లు కొనుగోలు చేశారని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా మునావర్ ఫౌర్కీ ప్రదర్శనకు వెళ్లే వారు తమ ఆధార్ కార్డ్ ని కూడా ఎంట్రీ సమయంలో చెల్లుబాటు అయ్యే ID రుజువును చూపించవలసి ఉంటుంది. వేదిక వద్ద ఆహారం, నీరు తీసుకెళ్లడానికి కూడా అనుమతి లేదు. అదేవిధంగా ప్రదర్శన యొక్క వీడియో రికార్డింగ్ కూడా అనుమతించబోమని పోలీసులు కండిషన్స్​పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement