Monday, May 6, 2024

Big Story | మద్యంపై ఫుల్​ ఆమ్​దానీ ఆ రాష్ట్రాలదే.. పదో స్థానంలో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం మద్యంపై వచ్చే ఆదాయంతోనే నడుస్తోందని నోరుపారేసుకునే మేధావులకు అసలు విషయం తెలుసా? అన్న సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పొలిటికల్​ లీడర్లు అయితే.. అడ్డం, పొడుగు ఏదేదో మాట్లాడుతుంటరని.. పలు సభలు, సమావేశాల్లో బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ చెబుతుంటారు​. అగో.. అట్లాంటి వారికోసమే ఈ డిటెయిల్స్​ అంటూ దేశంలో మద్యం అమ్మకాల వివరాలు, ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఆదాయం వస్తుందన్న లెక్కలను ‘స్టేట్స్​ ఫైనాన్స్​–స్టడీ ఆఫ్​ బడ్జెట్​ బై ఆర్​బీఐ’ నుంచి ఇండియా ఇన్​సైట్స్​ అనే సంస్థ సేకరించింది.. అవేంటో చదివి తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణ ప్రభుత్వం కేవలం మందుబాబుల వల్ల వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని నడుపుతుందని కొందరు విపక్ష నేతలు, నిరసనకారులు, మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు వేరే రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే జరగనట్టు ఆయా రాష్ట్రాల్లో మద్యం మీద అసలు ఆదాయమే రానట్టు వాళ్ల వితండవాదం ఉంటుంది.. పైగా తెలంగాణ ప్రభుత్వం ఏదో మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తమ అక్కసును వెళ్లగక్కుతుంటారు.  కానీ ఇక్కడ అంకెలు చెప్పే వాస్తవాలు వేరేలా ఉన్నాయి.  మద్యంపై అధిక ఆదాయం వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానం కాదు కదా కనీసం టాప్ 5 స్థానాల్లో కూడా లేదు.

ఒక రాష్ట్రం సమకూర్చుకునే మొత్తం స్వంత ఆదాయంలో మద్యం నుండి వచ్చే ఆదాయం వాటా ఎంత అని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్బీఐ వెబ్‌సైట్ నుండి లెక్కలు తీస్తే.. ఒక నెల క్రితం వరకు బీజేపీ పాలించిన కర్నాటక మొదటి స్థానంలో ఉంది, బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. పంజాబ్ మూడో స్థానంలో ఉండగా… తెలంగాణ మాత్రం 10వ స్థానంలో ఉంది.

- Advertisement -

రాష్ట్ర ఆదాయానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఇన్​కమ్​ పర్సంటేజీ

1. కర్నాటక – 22.86%

2. ఉత్తర ప్రదేశ్ – 22.28%

3. పంజాబ్ – 21.16%

4. పశ్చిమ బెంగాల్ – 20.79%

5. ఢిల్లీ – 19.92%

6. ఛత్తీస్​ఘఢ్​- 18.97%

7. మధ్య ప్రదేశ్ – 18.19%

8. ఆంధ్ర ప్రదేశ్ – 18.13%

9. హర్యానా – 16.32%

10. తెలంగాణ – 16.17%

Advertisement

తాజా వార్తలు

Advertisement