Friday, May 3, 2024

వాహనదారులకు ఊరట… తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగా ధరలను స్థిరంగా ఉంచిన చమురు సంస్థలు తాజాగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ పై 14 పైసలు, డీజిల్‌ పై 18 పైసలు తగ్గించాయి. దాదాపు 35 రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ రూ.97.15గా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది లీటర్‌ పెట్రోల్‌ రూ.11.44, డీజిల్‌ రూ.8.74 మేర పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement