Friday, May 3, 2024

వద్దు వద్దంటూనే ఉచిత పథకాలు.. రేషన్​ పథకం మరో మూడు నెలలు పొడిగించిన కేంద్రం!

ఉచితాలు వద్దు, అది నష్టదాయకం అని రాష్ట్రాలకు హితవుచెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాను మాత్రం ఉచిత పథకాలను అమలుచేస్తూ గొప్పలుపోతోంది. ఈ పేరుతోని అన్నిటిపైనా టాక్స్​లు, జీఎస్టీ అంటూ డబుల్​ చార్జీలు వసూలు చేస్తూ గల్లాపెట్టె నింపుకుంటోంది. ఇట్లా ఉచితాలు ఇచ్చినట్టే ఇచ్చి.. జనాల నుంచి పెద్ద మొత్తంలో దండుకుంటూ పేదల కష్టార్జితం కాజేస్తోంది. ఇక.. పండుగల వేళ దేశంలోని 80కోట్ల మంది పేదలకు ఉచితంగా గోధుమలు, బియ్యం అందించే ఉచిత రేషన్​ పథకాన్ని ఇవ్వాల (బుధవారం) ఎక్స్​టెండ్​ చేసింది.

మరో మూడు నెలల పాటు ఉచిత బియ్యం పథకం.. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పథకాన్ని పొడిగిస్తున్నట్టు ఇవ్వాల మంత్రి వర్గం నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ ప్రకటించారు. అంతేకాకుండా దేశంలోని మూడు రైల్వే స్టేషన్లను పునరుద్ధరించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

44,700 కోట్లకు పైగా ఖర్చుతో ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించనున్నారు. ఈ నెల వచ్చే శుక్రవారంతో ముగియనున్న 80కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల గోధుమలు, బియ్యం ఉచితంగా అందించే పథకం ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు కానుంది.

ఇక.. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని కూడా కేంద్రం 4 శాతం పెంచింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపుదల జరిగింది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది. ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ని అందజేస్తుంది.

- Advertisement -

రైల్వేల పునరుద్ధరణ..

ఇదిలా ఉండగా, భారతీయ రైల్వేలకు పెద్ద ఊతమివ్వడంలో న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, CSMT ముంబై అనే మూడు ప్రధాన రైల్వే స్టేషన్‌లను తిరిగి అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ. 10,000 కోట్ల పెట్టుబడి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement