Friday, October 11, 2024

Big Breaking | మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ఇక లేరు.. చికిత్స పొందుతూ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్​ రెడ్డి చనిపోయారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్​ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన టీడీపీ హయాంలో ఉన్నారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవ్వాల (మంగళవారం) కన్నుమూశారు. కొంతకాలంగా దయాకర్​రెడ్డి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన హెల్త్​ కండిషన్​ బాగాలేకపోవడంతోనే చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement