Friday, May 3, 2024

మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి కన్నుమూత

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబంలో విషాదం నెలకొంది. సురేశ్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. త్రిలోక్ చంద్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తమ సొంత నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ గతంలో భారత సైన్యంలో ఆర్డినెన్స్ విభాగంలో పనిచేశారు. రైనా తండ్రి పూర్వీకులది జమ్మూకాశ్మీర్. 1990లలో కాశ్మీర్ పండిట్ల హత్యల తర్వాత అతని తండ్రి గ్రామాన్ని విడిచిపెట్టారు.

కాగా, సురేశ్‌ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టీమిండియాలో ఒక దశాబ్ధం పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్న రైనా.. భారత్ తరపున 226 వన్డేలు, 78 టి20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా రైనా పేరు సంపాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement