Monday, December 4, 2023

దేశంలో తొలిసారి.. బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న ట్రాన్స్ జెండ‌ర్ జంట‌

త్వ‌ర‌లో తాము త‌ల్లిదండ్రులు కాబోతున్నామ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు ఓ ట్రాన్స్ జెండ‌ర్ జంట‌.వీరు కేర‌ళ కోజికోడ్ కి చెందిన వారు.మార్చి నెలలో తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు జియా..జ‌హ‌ద్. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించింది. తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్’ అంటూ జియా పావెల్‌ ఇన్‌స్టాలో రాసింది. నేను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువు నన్ను అమ్మా అని పిలవాలనే కల నాలో ఉంది.. మేము కలిసి మూడు సంవత్సరాలు అయ్యింది. తల్లి కావాలని నేను, తండ్రి కావాలని అతను (జహాద్) కలలు కన్నాం. ఈ రోజు అతని పూర్తి సమ్మతితో ఎనిమిది నెలల జీవితం కడుపులో కదులుతోంది’ అంటూ జియా రాసుకొచ్చింది. అయితే ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే ఇదే తొలిసారి. అయితే, సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను జహాద్‌ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement