Wednesday, May 1, 2024

భారతీ విధాన్ పేరుతో కాంగ్రెస్ యువ మేనిఫెస్టో.. ఉపాధే లక్ష్యంగా యూపీ ఎన్నికల్లోకి..

దేశంలో అత్యంత పెద్దదైన, అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ యువతను ఆకర్షించేలా ఢిఫరెంట్ గా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక ఇద్దరూ కలిసి యువ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ‘‘మా అవగాహన, మా నమ్మకం ప్రకారం దేశానికి కొత్త దార్శనికత అవసరం. ఈ దేశాన్ని కొత్తగా ఆవిష్కరించేందుకు యువత ముందుకు రావాలి. అది ఉత్తరప్రదేశ్ నుంచే  స్టార్ట్ చేద్దాం” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘భారతీ విధాన్’ పేరుతో ‘యువత మేనిఫెస్టో’ ఆవిష్కరణ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

యూపీలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొత్త విజన్ ఇవ్వగలదని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.  “ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల సృష్టిని మరచిపోండి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి కారణం మొత్తం 2-3 మంది పారిశ్రామికవేత్తలకు కొమ్మ కాయడమే కారణం. కాబట్టి, ఉద్యోగాలు ఎలా సృష్టించగలమని యూపీ యువతతో చర్చించాం. వారికి సరైన అవకాశాలు ఇవ్వాలని ఆ తర్వాతే కాంగ్రెస్ నిర్ణయించుకుంది. విజన్ డాక్యుమెంటరీ లో పొందుపరించింది సొల్లు పదాలు కాదు. అందులో ప్రతిబింబించే ప్రతీది యువతను సంప్రదించిన తర్వాత రూపొందించాం. అని రాహుల్ చెప్పారు.

యూపీలో రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో యువత నిరాశకు గురవుతున్నారని పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. వాళ్లు పడుతున్న కష్టాలు, వాళ్ల సమస్యలు ఏంటో చూశాం. అన్ని రాజకీయ పార్టీలు ఊరికే వచ్చి – 25 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని – హామీలు ఇస్తుంటాయి. కానీ.. ఎలా ఉద్యోగాలు ఇస్తారనేది  ఎవరూ వివరంగా చెప్పలేదు. కానీ, కాంగ్రెస్ యూత్ మేనిఫెస్టో ద్వారా వారికి జాబ్స్ ఎలా ఇస్తామన్నది స్పష్టంగా తెలియజేస్తోందని ప్రియాంక చెప్పారు.  ఈ రోజు యూపీలో యువత ఉద్యోగాలు పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు అర్హతలున్నప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి కావలసిన, అవసరమైన ఉపాధిని పొందడంలో సహాయం చేయడమే మా లక్ష్యం అని ప్రియాంక చెప్పారు. అంతే కాదు.. పరీక్షల సమయంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టి సారిస్తున్నాం. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడమే మా లక్ష్యం. పరీక్షలు, షెడ్యూల్‌లను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము ఉత్తరప్రదేశ్‌లో ఏటా యువజనోత్సవాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ప్రియాంక గాంధీ అన్నారు.

2014లో బీజేపీ ప్రతిపాదించిన విజన్ పూర్తి ట్రాష్ అని రాహుల్ గాంధీ అన్నారు. “దేశంలో ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను వారు జనాభా విపత్తుగా మార్చారు. బీజేపీలో కొందరు కూడా ఏదో తప్పు జరిగిందని అంగీకరిస్తున్నారు. అని రాహుల్ అన్నారు. యూపీలో తమ పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుకుంటోందని, కుల, మతతత్వంపై ఆధారపడిన ప్రతికూల ప్రచారంపై కాదని అన్నారు. మేము విద్వేషాన్ని వ్యాప్తి చేయము, మేము ప్రజలను ఏకం చేస్తాము. యువత బలంతో కొత్త ఉత్తరప్రదేశ్‌ను సృష్టించాలనుకుంటున్నాం.. అని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అగ్ర నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడిన అరుదైన సందర్భాల్లో ఇది ఒకటి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement