Thursday, April 25, 2024

తెలుగు అకాడమీ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. మరో భారీ స్కామ్‌కు ప్రధాన సూత్రధారి ప్లాన్‌..

ప్రభుత్వాలకు, ఉన్నతాధికారులకు తెలియకుండా వందల కోట్ల రూపాయలు నొక్కేసిన తెలుగు అకాడమీ కేసు నిందితులు మరో భారీ స్కీమ్‌కు ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. అకాడమీ ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది కలిసి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను దారి మళ్లించిన ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన షేక్‌ మస్తాన్‌ వలీ లీలలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు అకాడమీ స్కామ్‌ తరహాలో మరో భారీ స్కామ్‌కు స్కెచ్‌ వేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ గిడ్డంగుల శాఖకు చెందిన రూ.3 కోట్ల 98 లక్షలను కార్వాన్‌ యూనియన్‌ బ్యాంకు నుంచి కాజేసే ప్రయత్నం చేశాడు. తెలుగు అకాడమీ ఎఫ్‌డీలతో పాటే గిడ్డంగుల శాఖ ఎఫ్‌డీలను కూడా కాజేసేందుకు ప్లాన్‌ చేశాడు.

దాంతో గిడ్డంగుల శాఖ ఎఫ్‌డీలు సేఫ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. తెలుగు అకాడమీ స్కామ్‌ ప్రధాన సూత్రధారి షేక్‌ మస్తాన్‌ వలీపై కార్వాన్‌ యూని బ్యాంక్‌ మేనేజర్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ గిడ్డండుల శాఖ ఎఫ్‌డీలను కొట్టేసేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ సృష్టించారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న మస్తాన్‌ వలీని పిటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్‌ చేసేందుకు సీసీఎస్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement