Friday, April 26, 2024

తెలంగాణలో పూల పండుగ‌.. ఈ నెల 25నుంచి బతుకమ్మ ఉత్సవాలు షురూ!

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన‌ బతుకమ్మ ఉత్సవాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబురాలు నిర్వహించ‌నున్నారు. దసరాకు ముందు వచ్చే ఈ ఉత్సవాలు తెలంగాణకు కొత్త శోభ తెస్తాయి. ఈసారి బతుకమ్మ ఉత్సవాలను సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3వ తేదీ దాకా ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బతుకమ్మ పండుగకు ముస్తాబవుతున్నాయి.

అక్టోబరు 3వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద పెద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ బీఆర్కే భవన్ లో సమన్వయ సమావేశం నిర్వహించగా, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement