Monday, April 29, 2024

కమలా హారిస్ ను చంపేస్తానన్న మహిళ

అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లోరిడాకు చెందిన39 ఏళ్ల నివియనీ పిట్టిట్ ఫెల్ఫ్స్, కమలా హారిస్ ను హత్య చేస్తానని పేర్కొంది. ఈ విషయంలో విచారణ జరిపిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఆమెను అరెస్ట్ చేసింది. గతేడాది జరిగిన ఎన్నికల తరువాత కమలా హారిస్, అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఫ్లోరిడాలోని సదరన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలైన క్రిమినల్ కంప్లయింట్ మేరకు ఫిబ్రవరి 13 నుంచి 18 వరకూ ఫెల్ఫ్స్, కమలా హారిస్ ను బెదిరించారు. ఆమెను చంపుతానని, కుదరకుంటే హాని తలపెట్టేందుకు సిద్ధమని అంటున్న వీడియోలు విడుదల చేసింది. 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్స్ లో ఆమె పని చేస్తున్నట్టు విచారణ అధికారులు తెలిపారు.

నివియాన్ పెటిల్ ఫెల్ఫ్స్ భర్త ప్రస్తుతం జైలులో ఖైదీగా ఉన్నాడు. ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు జేపే అనే కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా మాట్లాడుకునే అవకాశముంది. ఫిబ్రవరి 13-18 మధ్య ఫెల్ప్స్ తన భర్తతో మాట్లాడింది. ఆ సందర్భంగా కమలా హారీస్కు ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టేలా ఫెల్ప్స్ మాట్లాడినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. ఆ వీడియోలలో ‘’కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. తుపాకితో నిన్ను కాల్చగలిగేంత దగ్గరగా నేను రానున్నాను. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు నీది కావచ్చు. కానీ, మరో 50 రోజుల్లో నీకు మరణం తథ్యం. ఇప్పటి నుంచి రోజులు లెక్కబెట్టుకో” అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement